
నా చెలయ రాగాలు
Read Count : 129
Category : Poems
Sub Category : N/A
నీ లేలేత పెదవులపై చిరు నవ్వులా నేనుండిపోనా
నీ కనులలో మెరిసే సన్నని మెరుపులా నేనుండిపోనా
నీ నల్లని కురులలో మెరిసేమల్లేలా నిన్నల్లుకు పోనా
నీకాలిని చుట్టిన మువ్వలా నిను చుట్టుకుపోనా
నీ కను రెప్పలపై వాలి నీకనులలో చూస్తుండి పోనా
నీ ఊపిరిలో ఊపిరిగామారి నీ గుండెలో ఉండి పోనా
నీ మెడలో ముత్యాల హారమునై నిన్నల్లుకు పోనా
నీ నల్లని జడనై నీ నడుమెంపులో దాగుండిపోనా
చివరకు నీ ఊహలలో భావంలా నీ గుండెలో వుండి పోనా .....!!........అభి
Comments
- No Comments