ఓ అమ్మాయి గాథ!? Read Count : 36

Category : Stories

Sub Category : YoungAdult
మల్కగిరి అనే ఓ పల్లెటూరిలో రాధిక, శ్రీకాంత్
అనే దంపతులు కాపురం ఉండేవారు. శ్రీకాంత్ పక్కనే
ఉన్న కొండపై వాళ్ళు పండించిన కాయగురాలు, పండ్లు
అమ్మేవాడు. రాధిక కూడా శ్రీకాంత్ కి సహాయం చేసేది.
కాని ఈ దంపతులకు పెళ్ళైన 3 సంవత్సరాలకి పాప
పుట్టింది. ఎన్నో నోములు నోచిన తరువాత పుట్టిన పాప..
కాబట్టి చాలా ప్రేమగా పెంచుతారు. ఆ అమ్మాయి పేరు
అపూర్వ ... అందంతో పాటు అభినయంలో కూడా ఓ మెట్టు
ముందే ఉంటుంది. శ్రీకాంత్ కష్టపడి, తనకున్న
చిన్న పొలాన్ని 5 ఎకరాలుగా మారుస్తాడు. రాధిక
కూతురిని బడికి పంపి, కుట్లు, అల్లికలు నేర్చుకొని
తను కూడా బాగా సంపాదిస్తుంది. శ్రీకాంత్ కి ఒక చెల్లెలు
ఉండేది, పేరు శ్రీనిధి. అన్న, వదినలకి తొందరగా
పిల్లలు కాలేదని వారితో మాట్లాడటం మానేసింది. కాని
శ్రీకాంత్ ఇప్పుడు బాగా సంపాదించేవాడు అయ్యాడు
కాబట్టి వదిన; అన్న అంటు లేని ప్రేమని ఉన్నట్టుగా
నటించేది. శ్రీనిధికి ఒక కొడుకు, కూతురు. కూతురిని
పెంచడం బరువుగా అనిపించి చిన్న వయసులోనే పెళ్ళి చేసి అత్తారింటికి పంపించింది..,
శ్రీకాంత్, రాధికకు శ్రీనిధి ప్రవర్తన ఎలాగూ తెలిసిందే ...
అపూర్వ 10 వ తరగతి పూర్తి చేసి, కళాశాలకి వెళ్ళే
సమయంలో, శ్రీకాంత్ అపూర్వ చేతుల మీదుగా ఒక హోటల్ ని 
ప్రారంభించాడు. కూతురి హస్తవాసితో శ్రీకాంత్ కి బాగా
కలిసివచ్చింది. 2 సంవత్సరాలలోనే బాగా డబ్బు 
సంపాదించాడు. ఇది ఇలా ఉండాగ, శ్రీకాంత్, రాధికకు
అసలు పిల్లలే పుట్టారు అని అభండాలు వేసిన బంధువులంతా -- ఎక్కడ లేని కపట ప్రేమను వీళ్ళపై దొర్లిస్తున్నారు.
అపూర్వ కూడా ఇంటర్ పూర్తి చేసుకొని పై తరగతులకు
పట్టణం వెళ్ళింది. శ్రీనిధికి తన కొడుకును. అపూర్వకు
ఇచ్చి పెళ్ళి చేస్తే అందం ఉన్న కోడలితో పాటు
అంతులేని ఐశ్వర్యం తన సొంతం అవుతుంది అని సంతోషించింది... 
కొడుకు తాగుబోతు,
అమ్మాయిలను పురుగులా చూసేవాడు. కేవలం మగాడి |
ఆశను తీర్చడానికే ఆడది పుట్టింది అని భావించేవాడు.
శ్రీనిధి కొడుకుకి అపూర్వని పెళ్ళి చేసుకునే ఉద్దేశం
లేదు. కాని తనని అనుభవించాలి అనే కోరిక ఉండేది.
శ్రీకాంత్, రాధికలు హోటల్ కి కావల్సిన వస్తువులు కొని,
తీసుకు వచ్చేటప్పుడు పెద్ద ప్రమాదం జరిగి దంపతులిద్దరూ
అక్కడికక్కడే మరణిస్తారు. గుంటనక్కలా ఎదురు చూసే
బంధువులు తప్పుడు లెక్కలతో హోటల్ ని స్వాహా.....,చేస్తారు. కాని శ్రీకాంత్ తన 5 ఎకరాల పోలాన్ని
అపూర్వ పేరు మీద రాస్తాడు.
తల్లి తండ్రులు పోయిన బాధలో అపూర్వ క్షీణించి
పోయింది. ఆదుకోవాల్సిన బంధువులు పాములా కాటేసి
వెళ్ళిపోతారు. శ్రీనిధి దొంగ ప్రేమను నటిస్తూ అపూర్వని
అక్కున చేర్చుకుంటుంది. అపూర్వ తెలివైనది. కాబట్టి
అత్త పన్నాగాన్ని తెలుసుకుంటుంది. శ్రీనిధి తన
కొడుకు కోరికను తీర్చి, అపూర్వ ఆస్తిని దక్కించుకోవలని
పథకం వేస్తుంది. అపూర్వని 2 నెలల పాటు చిత్రహింసలు
పెట్టి 5 ఎకరాల భూమిని తన పేరున రాయించుకుంటుంది
శ్రీనిధి ... అలాగే కొడుకు కోరికను తీర్చడానికి అపూర్వని
అందంగా తయారు చేస్తుంది. రాత్రి 12.30 అవుతుంది
శ్రీనిధి కొడుకు తప్పతాగి అపూర్వపై మోజు తీర్చుకోవడానికి మృగంలా తన మీద పడి అల్లరి చేస్తాడు.
అపూర్వ ఎంత బ్రతిమిలాడిన శ్రీనిధి కొడుకు,, శ్రీనిధి
ఇద్దరూ కరగరు. అపూర్వ తనని తాను కాపాడుకోవడా
నికి పక్కనే ఉన్న పెన్నుని శ్రీనిధి కొడుకు చేతికి
గుచ్చి పారిపోతుంది ....,నీరసించి పోయిన శరీరంతో అపూర్వ వేరే పల్లెలోకి
చేరింది. మనసులో చెప్పుకోలేనంత బాధ ఉన్న తన
కన్నీటిని మాత్రం జారనివ్వలేదు. అయినప్పటికి ఆకలి
కడుపుతో అలమటిస్తూ వేరే ప్రాంతానికి ప్రయాణం
కొనసాగించింది. తనకే తెలియని ప్రదేశం కాబట్టి వింతగా
చూట్టు చూసింది. అక్కడే ఓ పెద్దావిడ అపూర్వనే చూస్తూ ఉంది. ఆ పెద్దావిడ.., అమ్మాయి చూస్తే చాలా నీరసంగా
ఉన్నావు. ఎవరు నువ్వు అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.
అపూర్వ నేను ఒక అనాధనని చెప్తుంది ....
పెద్దావిడ :పర్లేదమ్మ నాతో రా --- పని ఇప్పిస్తాను అని
చెప్పి ఓ వ్యభిచారం (Prostitution) చేసే ఇంటికి
తీసుకెళ్తుంది. అపూర్వని బలవంతంగా ఇద్దరమ్మాయిలు లోపలికి
తీసుకువెళ్తారు. అపూర్వ తన జీవితం ఇలా ఎందుకు 
మారిపోయింది అని బాధపడింది. ఆ ఇంట్లో పనిచేసేవాళ్ళు
అపూర్వతో పాటు చాలా మంది అమ్మాయిలను ఇలాగే
మాయమాటలు చెప్పి బంధిస్తారు. వాళ్ళు తినే ఆహారంలో
మత్తు మందు కలిపి అమ్మాయిలకు స్పృహ లేకుండా
చేస్తారు. అందరమ్మాయిలకు పెట్టినట్టుగానే అపూర్వకి 
ఆహారం పెట్టారు. చాలా ఆకలితో ఉన్న; అపూర్వ
ఆ అన్నం తినదు. తనే కాకుండా అక్కడ ఉన్న అందరమ్మాయిలను కాపాడాలని అనుకుంటుంది.
అపూర్వని బంధించిన గదిలో చూట్టు క్షుణ్ణంగా చూస్తుంది అపూర్వ... ఒక పాత ఫోన్ కనిపిస్తుంది. అపూర్వ చాలా కష్టపడి ఆ ఫోన్ ద్వారా పోలిసులకి సమాచారం ఇస్తుంది. ఇది గమనించిన ఆ ఇంట్లో వాళ్ళు అపూర్వని ఒక నూనె పూసిన రాడ్ తో బాగా కొడుతారు.అపూర్వతో పాటు అక్కడున్న అమ్మాయిలందరిని మార్చడానికి ఒక లారి సిద్ధం చేసి అమ్మాయిలందరిని ఆ లారిలో ఎక్కిస్తారు.మార్గమధ్యంలోనే అపూర్వ తన తెలివితేటలలో లారీ డ్రైవర్‌ని మాటల్లో పెట్టేసి
అమ్మాయిలందరిని లారి నుండి తోసేస్తుంది. తాను కూడా లారి నుండి దూకేస్తుంది. పోలీసులు వాళ్ళందరిని ఆస్పత్రికి
తీసుకెళ్ళి వైద్యం అందించి అపూర్వని ప్రశంసిస్తారు. అపూర్వకు తగిన ఉద్యోగం ఇస్తారు. ఒంటరి జీవితానికి
అలవాటు పడ్డ అపూర్వ .. తన లాగే ఎంతో మంది 
అనాథలను ముఖ్యంగా ఆడపిల్లల కోసమని ఓ ఆశ్రమాన్ని
తన జీతం డబ్బులను పోగేసి కడుతుంది.., ఆకలి అన్న
వాళ్ళ ఆకలిని తీర్చి చిన్న వయసులోనే మంచి పేరు
తెచ్చుకుంటుంది...,అపూర్వ తనలాగే ఎంతోమంది ఆడపిల్లలు చిన్న వయసులోనే అమ్మ, నాన్నలకి దూరం అయ్యి., ఈ సమాజంలో నిలదొక్కుకోలేక మగాడి ఆకలికి బలి అవుతున్నారు అని బాధ పడింది.., అపూర్వ 
కట్టించిన ఆశ్రమానికి ఒక రోజు ఓ కోటీశ్వరుడు వచ్చి,అపూర్వని ఒక రోజు తన ఇంటికి రమ్మని, బెదిరిస్తాడు.
రాకపోతే తన ఆశ్రమాన్ని తప్పుడు దారిలో డబ్బులు సంపాదించడానికే కట్టావని ప్రచారం చేస్తాను అని
చెప్పి వెళ్ళిపోతాడు. అపూర్వ ఆశ్రమంలో సుమారు 600
పైగా పిల్లలు ఉంటున్నారు. వాళ్ళకు, తిండి, చదువు అన్ని అపూర్వే సమకూర్చేది.., నా జీవితం ఏలాగో ముల్లబాటే..,
కనీసం నా ఆశ్రమంలో పిల్లల జీవితంలో అయిన సంతోషం
ఉండాలని అపూర్వ ఆ కోటిశ్వరుడి ఇంటికి
వెళుతుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన
కోటీశ్వరుడు అపూర్వ రాకకై మిక్కిలి సంతోషిస్తాడు..
ఆ కోటీశ్వరుడు మగువ మీద ఉన్న పైశాచిక కామంతో.., తన గదిని పూలవనం లా.. అలంకరిస్తాడు.అపూర్వకి తినడానికి ఎన్నో రకాల వంటలను చేయించి తిను అని ఆ కోటీశ్వరుడు గద్దిస్తాడు..అపూర్వ ని మంచంపైకి నెట్టి తన కోరికను 
తీర్చుకోవాలనుకుంటాడు. అపూర్వ గట్టిగా తన కళ్ళను మూసుకొని వాళ్ళ అమ్మ,నాన్నని తలచుకొని.., 
మీరు నాపై పెంచుకున్న ప్రేమ,నేను నా భవిష్యత్తుకై
కన్న కలలు ఆ దేవుడికి నచ్చినట్టు లేదు. అందుకే మిమ్మల్ని దూరం చేసి నా జీవితాన్ని ఇలా కుక్కలు
చింపిన విస్తరులా మారుస్తున్నాడని దేవుడిని
నిందిస్తుంది. అయిన సరే నేను స్థాపించిన నా ఆశ్రమాన్ని అయిన జాగ్రత్తగా చూసుకో దేవుడా
అంటు మనసులో కుమిలిపోతుంది. కామంతో కొట్టుకుంటున్న ఆకోటిశ్వరుడు అపూర్వ మీదకి పడబోయాడు.
ఇంతలో శ్రీనిధి కొడుకు, ఆ కోటిశ్వరుడ్ని పట్టుకోని నా మర్దాలుని నాశనం చేస్తావారా అంటూ కొట్టడం ప్రారంభిస్తాడు.
ఇద్దరు పోటాపోటిగా కొట్టుకొని గాయపడ్తారు.అపూర్వ తన బావని (శ్రీనిధి కొడుకుని తీసుకొని ఆ కోటిశ్వరిడి ఇంటి నుండి బయటకు వచ్చేస్తుంది , చాలా గాయపడ్డ తన బావని ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తుంది. శ్రీనిధి కూడా అపూర్వ దగ్గరికి
వస్తుంది. శ్రీనిధి కొడుకు అపూర్వతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను... నీకిష్టం అయితే మనం పెళ్ళి చేసుకుందాం.నేను మారిపోయాను అంటూ దుఃఖిస్తాడు.అపూర్వ తన
బావని హత్తుకొని ప్రేమించే అమ్మా, నాన్నకి దూరమైన నాకు మాత్రం ఎవరు ఉన్నారు. బావ నీ ప్రేమ అయిన
కడదాక తోడుండాలి అని కోరుకుంటున్నాను
అని ఏడుస్తుంది. శ్రీనిధి, తన కొడుకుకి, అపూర్వకి పెళ్ళి చేసి
తన అన్న 5ఎకరాల భూమిని అపూర్వకి
ఇచ్చేస్తుంది.అపూర్వ తన బావతో కలిసి జీవితాన్ని
సంతోషంగా గడుపుతూ ఎందరో
అనాధ పిల్లలని దత్తత తీసుకొని పెంచుతుంది. ఒక రోజు అపూర్వరి
సభలో సన్మానం ఏర్పాటు చేస్తారు
ప్రభుత్వ కార్యకర్తలు..,సన్మానం పూర్తి చేసి, అపూర్వని
మాట్లాడవలసిందిగా కోరుతారు... పెద్దలు.,అపూర్వ ముందుగా పెద్దలందరికి గౌరవ నమస్కారం చేసి..., నా నుండి మీ అందరికి ఒకే ఒక విజ్ఞప్తి నేను చెప్పే మాటలు కేవలం మీ చెవులతో కాకుండా
మనసుతో వినండి. అమ్మాయిలు తలుచుకుంటే ఏదైన
చేయగలరు. మీకు సహాయం చేయలనిపిస్తే చేయండి కాని తక్కువ అంచన వేయకండి. నా ప్రియమైన మహిళ మిత్రురాల్లాకి నా చిన్న సలహ--అమ్మాయివని భయపడకు., నీ వల్ల కాదని కృంగిపోకు...
ధైర్యం చేసి ఒక్క అడుగు ముందుకు వేసి,
నీ ఆలోచనలను, లక్ష్యాన్ని సకారం చేసుకో
అని చెప్పి ముగిస్తుంది. .
.
.
.
Pen name: ~@NK

Comments

  • No Comments
Log Out?

Are you sure you want to log out?