విడిపోని బంధమా!! Read Count : 31

Category : Stories

Sub Category : Drama
వైకిరి అనే గ్రామానికి శ్రీకాంత్ అనే ఓ పటేల్ సాబ్ సర్పంచ్, గ్రామస్తులను సొంత వాళ్ళుగా చూసుకునే వాడు.., అతని కూతురు అలేక్య ఋద్దిలో, మంచితనం లో తన తండ్రి ని మించినది.., అలేక్య కి ,నీహ అనే స్నేహితురాలు ఉండేది.., 
చెట్టు, చేమా !! పుట్ట ఇలా ఒక్కటేమిటి ప్రకృతి లో ఉన్న అన్ని జీవులు వాళ్ళ బందాన్ని, ఐక్యత ని చూసి మెచ్చుకోక ఉండలేరు.. ఏలాంటి సమస్యలైన, సంతోషాలైన ఒకరికొకరు కచ్చితంగా పంచుకుంటారు.., నీహ చదువులో చురుకైనది, అలేక్య అంతంతగా చదివేది, నీహ వాళ్ళ నాన్న ఓ దర్జీ ..,వీళ్ళది చిన్న కులం.., అందుకే అలేక్య వాళ్ళమ్మ చిన్న కులం వాళ్ళతో స్నేహం చేస్తే చిల్లర బుద్దులు అబ్బుతాయి అంటు నీహకి, అలేక్యని దూరం చేయాలనుకుంటుంది కాని తన వాళ్ళ కాదు.., ఆ మిత్రుల్ని వేరు చేయడం.., 
కొన్ని రోజులకి నీహ వాళ్ళ నాన్న గుండె పోటు తో మరణిస్తాడు..
అలేక్య వాళ్ళమ్మ , అలేక్యని నీహకి శాశ్వతంగా దూరం చేయాలని నిర్ణయించుకుంటుంది.., కానీ అలేక్య అమ్మని ఎదురించి నీహ దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పి తనను ఓదార్చి అన్నం తినిపించి ఇంటికి వెళ్తుంది.., అమ్మ మాట దాటిన నువ్వు నా కూతరివే కాదు అని అలేక్య వాళ్ళమ్మ అలేక్యతో మాట్లాడడం మానేస్తుంది.., అలేక్య చాలా బాధ పడుతుంది శ్రీకాంత్ కూతురిని దగ్గరికి తీసుకొని తనను బుజ్జగిస్తాడు.., నీహ కుట్లు, అల్లికలు వేస్తూ అమ్మని, చూసుకుంటూ చదువు కొనసాగిస్తుంది.., అలేక్య వాళ్ళ నాన్న సాయంతో నీహకి కొంత డబ్బు ఇస్తుంది.., నీహ ఆ డబ్బుని నిరాకరించి నీ స్నేహం ముందు నాకు ఈ డబ్బు దేనికి పనికిరాదు అంటు అలేక్య చేతిని పట్టుకుంటుంది.., 
అలా కొన్ని రోజులకి నీహ పై చదువుల కోసం కష్టపడి డబ్బు సేకరిస్తుంది.. కానీ ఎవరో ఆ డబ్బుని దొంగిలిస్తారు.., నీహ చాలా బాధ పడుతుంది.., అలేక్య చిన్నప్పటి నుండి దాచుకున్న డబ్బుని నీహాకి ఇచ్చి నీ చదువు ఏందరో అనాథ పిల్లలకు సాయం కావలి అని మాట తీసుకుంటుంది.., 
3,4 సంవస్సరాలు గడుస్తాయి.. 
నీహ చదువు పూర్తి చేసి అలేక్యకి మాట ఇచ్చిన విధంగా ఓ అనాథశ్రమాన్ని స్థాపించి దానికి అలేక్య అని పేరు పెడ్తాది.., అలేక్యకి,వాళ్ళ అమ్మకి, ఇవేవి తెలీదు.., అలేక్య ఓ చిన్న సంస్థలో పనిచేస్తూ ఉంటుంది.., నీహ నిన్ను మరిచిపోయి తను జీవితంలో స్థిరపడింది అంటూ ఊర్లో జనాలు అలేక్య ని వెక్కిరిస్తారు.., శ్రీకాంత్ పదవి పోయి అప్పుల పాలు అవుతాడు..,
సరిగ్గా అదే సమయంలో నీహ అలేక్య దగ్గరికి వచ్చి నా ప్రియమైన నేస్తం నాతో రా.., అని అలేక్యని, వాళ్ళ అమ్మ, నాన్నని తను స్థాపించిన అనాథశ్రమానికి తీసుకెళ్తుంది.., ఇదంతా చూసిన ఊరి జనాలు ఆశ్చర్య పోతారు, ఆ అనాథశ్రమం ప్రవేశ దారిలో ఇలా రాసి ఉంటుంది..,
"నా రక్త సంబంధానివి కాకపోయినా నాకు పునర్జన్మను ప్రసాదించిన దేవత"..,
"నాకు పాఠాలు చెప్పే గురువు కాకపోయినా జీవిత పాఠాలు బోధించిన మహానుభావురాల"?
ఏమిచ్చి తీర్చుకోగలను నీ రుణం? 
నా మంచి కోరే నా ఆప్తురాల.., నన్ను ప్రేరేపించిన నా ప్రియమైన నేస్తమా!! 
పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా!! 
అదంత చదివిన అలేక్య నీహను హత్తుకొని "నీతో పరిచయం నాకు వరం"
"మన ఇద్దరి మధ్య దూరమే నాకు శాపం.."
కలకాలం కడదాక నీ తోడు ఉంటానని చేస్తుంది.., 
అలేక్య చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి ఆ అనథాశ్రమాన్ని తెరిపించి,నడిపిస్తూంది నీహ..,ఇదంతా చూసి అలేక్య వాళ్ళమ్మ,.. అలేక్యకి, నీహకి క్షమాపణ చెప్తోంది.., 
నీహ, అలేక్య ఏందరో అనాథ పిల్లలకు సాయం చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడుపుతారు..,..
.
.Do follow for more quotes:
https://www.instagram.com/soul_touching_writings29.
.
.

.
Pen name:~@NK

Comments

  • Yamuna Gurram

    Yamuna Gurram

    may I know how u r writing in telugu

    Jul 31, 2020

  • Nice impressive drawling but the language got me😵 ???????

    Jul 31, 2020

Log Out?

Are you sure you want to log out?