రక్షక కవచం Read Count : 43

Category : Stories

Sub Category : Drama
రక్షక కవచం

అందమైన ఓ మేడలో ఓ చిన్న కుటుంబం.. తల్లి:గీత,తండ్రి:శివ,కొడుకు:హేమంత్, కూతురు:హేమ
శివ బ్యాంక్ ఉద్యోగి, గీత పాఠశాలలో గణితశాస్ర ఉపాధ్యాయురాలు.., పిల్లలిద్దరే వారి ప్రపంచం.., 
హేమ కంటే హేమంత్ 2సంవత్సరాలు పెద్దవాడు..,పిల్లి, ఎలుకలు, పాము, ముంగిసల్ల అన్న, చెల్లెలిద్దరూ పోట్లాడుకునే వారు.. "వీళ్ళ గొడవ ఆపలేక గీత, శివలకు తల ప్రాణం తోకలోకి వచ్చేది"..🤦‍♀
హేమంత్ ఇంటర్,హేమ 10వ తరగతి పూర్తి చేసుకున్నారు..,
అదే సమయంలో హేమ చూసుకోకుండా చేతుకు దెబ్బ తగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో గీత, శివలు వచ్చి గాయానికి మందు రాస్తుంటారు..,హేమంత్ హేమని చూస్తూ చాలా గట్టిగా నవ్వుతూ.🤣😂.,మంచిగా అయ్యిందని వెక్కిరిస్తాడు 😛దాంతో హేమకి అన్న మీద చాలా కోపం వచ్చి అప్పటి నుండి ఏ దెబ్బ తగిలించుకోకుండా జాగ్రత్త పడుతుంది..,కానీ నిజానికి హేమంత్ చెల్లికి దెబ్బ తగిలిందని చాలా బాధపడ్డాడు.., ఈ విషయం కొన్ని రోజులకి హేమకి తెలుస్తుంది.., హేమ..,హేమంత్ తో నా ముందు అంత నవ్వి, పక్కకెళ్ళి ఎందుకు ఏడ్చావ్ అని అడగ‌డంతో అమ్మా, నాన్న ల ప్రేమతో చెప్తే నువు వినే రకమా!! నీపై నువ్వు శ్రద్ధ తీసుకోవాలని అలా వెక్కిరించాను అని చెప్పాడు!! 
2,3 రోజుల్లో శివ, గీతల పెళ్ళిరోజు.., గుడికి వెళ్లలని తయారవుతారు!కాని హేమంత్ నిద్ర లేవలేక గుడికి రాను చెప్పేసాడు, ..అన్న రాట్లేదని హేమ కూడా వెళ్ళదు.., శివ, గీతలు దైవ దర్శనం చేసుకుని ఇంటికి బయలుదేరారు..!! మధ్యలో వాళ్ళ కార్ కి
లారీ డీకొని శివ, గీతలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతారుశివ,గీతలు తిరిగి రాలేని చోటుకు వెళ్ళారని హేమ, హేమంత్ తెలుసుకున్నారు.., ఆ విషయాన్ని విన్న పసి మనస్సులు గుండె పగిలేలా దుఃఖించారు😭😖.
కొన్ని రోజులుకి ఏలాగోలా కోలుకుంటు ఉంటారు ఆ విషాదం నుండి..,కానీ అదే సమయంలో బంధువులు పిల్లలిద్దర్ణి..మోసం చేసి వాళ్ళ ఆస్తి కాజేస్తారు..,
హేమంత్ ఒకవైపు( బి. టెక్ )చదువుతూ.., పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ హేమని ఇంటర్ చదివిస్తాడు.., చెల్లికి అమ్మ ప్రేమతో పాటు, నాన్నతో ఉంటే వచ్చే ధైర్యంగా ..,హేమంత్ హేమని బాగా చూసుకునేవాడు..,
హేమంత్ కళశాలలో అందానికి అర్థంలా ఉండేది హిమ అనే అమ్మాయి.., ఎంతో మంది ప్రయత్నించిన ఎవరీ ప్రేమను ఒప్పుకోదు..,, అందంతో పాటు, అభినయం, అణకువ ఉన్న హిమ తనకు వచ్చే అబ్బాయి ఆడదాని అందం చూసి కాకుండా మనసును అర్థం చేసుకునే వ్యక్తిని కోరుకుంటుంది.. కళశాలలో హేమంత్ పైన అందరికి మంచి అభిప్రాయం ఉండేది.., ఒకసారి కళాశాల కార్యక్రమంలో హేమంత్ అన్న,చెల్లి బంధం పైన ఉపాన్యాసం ఇచ్చాడు అందరూ ప్రశంసల్లో హేమంత్ నీ ముంచేసిన హిమ మాత్రం చెల్లెల్నే ఇంత గొప్పగా గౌరవించేవాడు.., వచ్చే భార్యను ఇంకేత అర్థం చేసుకోగలడో అని హేమంత్ పైన ఆశలు పెంచుకొని ప్రేమిస్తుంది 2సంవత్సరాలు తెలియకుండానే గడిచిపోతాయి.., 2వ సంవత్సర సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేసుకుని సెలవులకు వెళ్ళే సమయంలో హిమ, ‌‌‌హేమంత్ కి తన మనసులో మాట చెప్పి మనం పెళ్లి చేసుకుందం అని అంటుంది.., 
హిమ మాటలకి హేమంత్ నన్ను క్షమించు, నా బాధ్యతని నిరవేర్చే దిశలో నా ప్రయాణం కొనసాగిస్తున్న..,నాపై నీ ప్రేమని చెరిపెసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు, 2సంవస్సరాలు గడిచిపోతాయి అయిన హిమ హేమంత్ కోసమే ఎదురుచూస్తుంది.., ఇక ఓ వైపు హేమ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నది హేమ కళశాలలోనే హిమ తమ్ముడు కేశవ చదువుతున్నాడు., కేశవ, హేమలకి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం కాని.., హేమ., అన్న మీద గౌరవంతో మౌనంగా ఉండిపోతుంది.., కేశవ హేమ పరిస్థితిని గమనించి అక్క సహాయం తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు, కేశవ హిమతో అన్ని చెప్పాక, సరేరా అమ్మ, నాన్నని, హేమ వాళ్ళ అన్నని ఒప్పిస్తానని తమ్ముడికి మాట ఇస్తుంది, హిమ,హేమ వాళ్ళ అన్న దగ్గరికి బయలుదేరుతుంది, హేమంత్ ని చూశి ఆశ్చర్య పోతుంది అప్పుడర్థమవుతుంది హిమకి.., హేమంత్ బాధ్యత అతని చెల్లెలని.., ఆలస్యం చేయకుండా వెంటనే ఈ విషయాన్ని హేమంత్ తో చెప్పేస్తుంది, హేమ సంతోషమే నాకు కావాల్సింది అని ఒప్పుకుంటాడు,., ఇక హేమ, కేశవలు కలిసి హేమంత్, హిమలను కలుపుతారు,., హిమ కేశవ తల్లిదండ్రులు 2 పెళ్ళిల్లకి ఒప్పుకుంటారు, చెల్లెలి ఆనందం హేమంత్ కి సంతృప్తినిస్తుంది.., అమ్మ, నాన్నని కోల్పోయిన హేమంత్, హేమలకు ..,హిమ, కేశవ వాళ్ళ తల్లిదండ్రులు అత్త, మామలుగా కాకుండా అమ్మ, నాన్న అయ్యారు.,
అనథాలైన.., హేమంత్ ,హేమకి తల్లి ప్రేమను పంచి, తండ్రి బాధ్యని తీర్చి ఒక అందమైన జీవితాన్నిచ్చి, రక్షక కవచం అయ్యాడు...
.
.
.
.
.
Pen name: ~@NK

Comments

  • Serajul Ansari

    Serajul Ansari

    hi

    Jul 30, 2020

Log Out?

Are you sure you want to log out?