హత్య....? Read Count : 145

Category : Stories

Sub Category : Drama
అదెంటో తెలియదు కానీ తన సమ్మోహన రూపం నా కళ్ళకు కట్టేసినట్టు నా ముందే తిరుగుతుంది..
తను నాకు చాలా దగ్గరగా ఉంది , ఎంత దగ్గర అంటే తన శ్వాస నాకు తగిలే అంత దగ్గరగా...
ఏదో తెలియని అలజడి మొదలైంది,
గుండే వేగం పెరిగింది,
అదరాలు వణుకుతున్నాయి,
తన శ్వాస నా శ్వాస కలిసిపోయాయి,
అంతర్లీనంగా తెలియని కుతుహాలం పెరిగింది,
దేహాలు కలవాలి అన్న ఆరాటం మొదలైంది,
కరచాలు తన దేహాన్ని తాకాలి అన్న ఉబలాటంలో తనని తాకాను .......
అంతే నా ముందు ఏమి లేదు అంతా శూన్యం..
నా కళ్ళు మేఘనాని వేతుకుతున్నాయి , తను లేదు ..............?
ఇంతకి తను ఎక్కడ ఉంది?
ఆ ఆలోచనలతో తల తీసేసినట్టు అయింది......  పక్కన టేబుల్ పైన మేఘన పోటోకి దండ వేసి ఉంది, ఆ పోటో ముందు దీపం కూడా వెలిగించారు , చనిపోయిన వారిని కదా ఇలా చేసేదీ........
అంటే దీనర్ధం మేఘన చనిపోయిందా....?
తను చనిపోయినట్టు కూడా నాకు తెలియదా?
మరి నా ముందు ఇంతవరకు ఉన్నది ఎవరు?
తన ఆత్మనా అది?


నాకొచ్చిన అన్ని సందేహలని నా డైరి లో బందిందామని రాయటం మొదలుపెట్టాను,
కన్నిళ్ళు ఆగటం లేదు, ఏదో రాస్తున్నాను....

సడన్ గా.......

షేక్సపియర్....
అనే పిలుపు దూరంగా వినిపించింది,, అలా పిలిచేది నా మేఘన .....
తను ఇక్కడే ఎక్కడో ఉంది...
అని లేచా ఎవరు లేరు చుట్టూ చూస్తే..
మళ్ళీ అదే పేరు వినిపించింది....
షేక్సపియర్......
ఈసారి ఆ పిలుపు వస్తున్న వైపు వెళ్ళాను...
బాల్కనీ లో నుంచి వినిపిస్తోంది.. 
అక్కడి నుండి చూసా... 
చుట్టూ తోట... 
ఇంటిపక్కనే మామిడి చెట్టు....
ఆ చెట్టు కింద మేఘన....
షేక్సపియర్ నాకు మామిడికాయ కావాలి అందటం లేదు..........
కొంచెం కోసి ఇవ్వవా.......
నా ఆనందానికి అవదుల్లేవు.......
ఇంకో క్షణం ఆలోచించకుండా పరిగెత్తాను....
మెట్లు దిగుతున్నా... 
తను మెట్లు కింద నుల్చొని రమ్మని అంటున్నది..
తను నాకు చాలా దగ్గరగా ఉంది అనే ఆలోచనలో పరుగు ఇంకాస్త వేగం అందుకుంది...
అవి మెట్లు అంత వేగాన్ని ఆపుకోలేక కింద పడిపోయా.....
కాలు బాగా నొప్పి గా ఉంది...
అయినా తన ముందు ఆ నొప్పి చాలా చిన్నదిగా ఉంది...
తనని సమీపించేలోపే మాయమైంది.....
ఏంతో ఆతృతగా అన్ని వైపులా చూసాను.....
దూరంగా ఉంది తను.....
రమ్మని పిలుస్తుంది.....
ఈసారి నేనే గెలిచాను.... 
తనని అందుకున్నా.......
నా కౌగిలిలో బందించా.....
తన మోము పై అణువణువు నా అదరాలతో చుంబిఃచా........
తనేదో చెప్పబోతుంది....
అవి నేను వినదల్చుకోలేదు.....
అందుకే తన పెదవులని నా పెదవులతో ఏకం చేసా........
ఏదో తెలియని అనుభూతి..
కోంత సమయానికి అర్ధం అవుతుంది నా వీపులో మంట....
 ఏదో తెలియని నొప్పి...
అప్పుడు అర్థం అయ్యింది అది తన చేతి గోరు...
భాద ఇంకా ఎక్కువ అయ్యింది....
తన నుండి దూరంగా వచ్చి ...
ఏం చేస్తున్నావ్ మేఘన......
తను ఏదో చెప్తుంది.......
సడన్ గా నన్నేవరో కొట్టారు మెలుకువ వచ్చింది....
పక్కన అమ్మ....
ఏంటిరా పీడకల ఏమైనా వచ్చిందా....?
కల కాదు అమ్మ మేఘన వచ్చింది నిజంగా...
అరే తను చనిపొయి వారం అవుతుంది...
తనేలా వస్తుంది.......
ఏం ఆలోచించకుండా పడుకో....
అమ్మ మాటలకి ఎదురు చెప్పలేదు...
నటించా నిద్రపోయినట్టు.....
అమ్మ వెళ్ళిపోయాకా... 
లేచా...
అబ్బ కాలు బాగా నొప్పి నడవలేకపోతున్నా.....
వీపు మంట అలానే ఉంది ...
అద్దం దగ్గర చూసా షర్ట్ మొత్తం రక్తంతో తడిసిపోయింది......
ఎదురుగా డైరీ ఉంది.....
అందులో రసి ఉంది.....
ఇదంతా కల అయితే.....
నా కాలు నొప్పి ఎలా వచ్చింది.....?
నా వీపుపై రక్తం.....?
డైరీలో ఎవరు రాసారు......?


ఏం అర్థం అవ్వట్లేదు.........!
మేఘన చనిపోయిందా...?
మరి ఇదంతా ఎలా జరిగింది....?
ఎన్నో ప్రశ్నలు వేదిస్తున్నాయి......!
అసలే తను పక్కన లేదు అనే నిజాన్ని ఎదుర్కొలేక అతలాకుతలం ఆవుతుంటే.....
ఇన్ని ప్రశ్నలు నా బాధని తారా స్థాయికి పెంచాయి......!
తనేలా చనిపోయింది ఈ ప్రశ్న నుండి సమాదానం వెతికితే ఏదైనా ఫలితం ఉంటుంది........
అమ్మ ని అడిగితే పిచ్చొడు అంటుంది...
నీ కళ్ళ ముందే ఇదంతా జరిగింది మళ్ళి నన్ను అడుగుతావెంటి అంటుంది........
మరి ఏం చేయాలి??????
ఈ సారి తనని అడిగేస్తా......
మేఘన నా ప్రశ్నలకీ సమాధానం చెప్పు ....
అంటూ పిచ్చోడిలా అరుస్తున్నాను...
తను ఎదురుగా వచ్చింది....
నేను తనని చూసిన ఆనందంలో నన్నేను మరిచిపోయా.................
తను నా దగ్గరగా వచ్చింది...
నా ఆనందాన్ని తనతో పంచుకోవాలి అని గాఢంగా అత్తుకున్నా.......
తనని మమేకంతో చుంబిస్తున్నా......
మా ఇద్దరి అధరాలు కలిసిపోయాయి....
నా జిహ్వం తన జిహ్వంతో మమేకమై తెలియని అలజడి..........
ఒక్కసారిగా తను నన్ను దూరంగా నెట్టింది....
నేను కింద పడిపోయా......
అప్పుడు జ్ణాపకం వచ్చింది.....
నువ్వేలా చనిపోయివు అని తల కిందకి దించుకోని అడిగా......
తన నుంచి నేను వినకుడని సమాధానం....
" నువ్వే చంపేసావ్ రా..... నీ చేతులతో చంపేసావ్......"
నేనా......?
హా నువ్వేరా........................
నువ్వంటే పిచ్చి నాకు , నువ్వు నన్ను చంపిన ఇంకా నీవెంట ఆత్మలా వస్తూనే ఉన్నా........

నేన చంపానా.......?
నా మేఘన ని నేనే చంపుకున్నానా....?

కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి.......!
మేఘన చెప్పిన మాటలు నా చెవుల్లో మార్మోగుతున్నాయి........!
" నువ్వే చంపేసావ్ రా....! నీ చేతులతో నువ్వే చంపేసావ్......!"
తనే నా ప్రాణం అనుకున్నాను కదా..... మరి నా ప్రాణాన్ని నేనేలా చంపేసా.....?
తన ప్రాణం తీసేసిన, ఇంకా నా దేహంలో ప్రాణం ఎందుకు ఉంది......?
ఈ లోకంలో మేఘనని ప్రేమించినట్టుగా ఎవర్నీ ప్రేమించలేదు కదా....!
మరి తన ప్రాణాలే నేను తీసేసానా....?
అయ్యో భగవంతుడా....!
ఈ పాపాత్ముడు.....
మూర్ఖుడు.....
నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచి ఈ విరహవేదనని నాకు శిక్ష విధించావా.....?
నాకు తెలియకుండానే నేనేలా చంపుకున్నా....?
నేత్రాలు నీళ్ళతో నిండిపోయాయి...
తల పైకెత్తి చూసా.......
నా ప్రాణం, నా ప్రేమ , మేఘన లేదు.....
గదంతా వెతికా..........
ఎక్కడ లేదు...
నేను అరుస్తున్న మాటలు అమ్మ విందేమో పరుగునా నా గదిలోకి వచ్చింది.....!
కింద పడిపోయి ఏడుస్తున్న నన్ను చూసి.......
"బాబు ఏంటిరా నాకీ కర్మ......
కోడలు వచ్చింది అని ఆనంద పడుతున్న సమయంలో ,తనని మనందరికీ దూరం చేసావు...
ఇప్పుడేమో ఇలా ఏడుస్తున్నావు....
అంతగా ప్రేమించి , తనని ఎందుకు చంపేసావురా...?"

అమ్మ నన్ను క్షమించు అమ్మ....
నాకు నిజంగా ఏం గుర్తులేదు.....
తనని నేనేందుకు చంపుకుంటానే...
నీ తర్వాత అంతగా ప్రేమించింది తననే కదా.....
నేనేదో తప్పు చేసా...
ఆ తప్పుకి శిక్ష పడాల్సిందే.....
నీ చేతులతో నన్ను చంపేయ్... అమ్మ...

రేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా????
అయ్యిందేదో అయ్యింది...
జరిగిన తప్పు తెలుసుకో....
ఇంకేప్పుడు ఆ తప్పు జరగకుండా చూడు...
అసలే ముసలి ప్రాణం , ఎప్పుడు పోతానో తెలీదు...
ఈ ఉన్నన్ని రోజులు మంచిగా ఉండురా.....
ఉండు నీకు అన్నం తీసుకుని వస్తాను.....
అమ్మ వెళ్ళిపోయింది.........

అమ్మ కూడా నేనే చంపాను అంటుంది.......!
నేనెందుకు చంపా......
అలా అరుస్తూ ఉన్న....
ఎదురుగా నా మేఘన......
తనని చూసిన ఆనందంలో నేనెటువంటి పరిస్థితిలో ఉన్నానో కూడా మరిచిపోయా......!
తనని తనివితీరా, గాఢంగా హత్తుకున్నాను...!
ఎలా అయినా తన శ్వాసని నా శ్వాసలో బంధిచేయాలని తన అధరాలని నా అధరాలతో బంధించా.......
తనని నా కౌగిలిలో ఖైదీ చేసీ ఊపిరి ఆడనంత బిగుతుగా బంధించా.......
నా చేతులు తన దేహాన్ని అణువణువునా తాకుతున్నాయి.....
నా చేతిలోనా, ఈ లేడికూనా ఏం అవ్వనుందో ఈవాళ............
తన చేవుల దగ్గర అలా అన్పానో లేదో నన్ను అమాంతంగా నెట్టేసింది......
దూరంగా పడ్డాను.....
బ్రతికున్నప్పుడు ఈ కామవాంచతో నన్ను చంపేసావు.... 
చచ్చాక నీ బాధ చూడలేక వస్తే చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నావు........................


ఏంటి మేఘన ఏం మాట్లాడుతున్నావ్......
కామవాంచతో చంపటం ఏంటిరా.....?

అవును షేక్సపియర్......
నీకు తెలియకుండానే నీకు ఒక వ్యాది ఉంది...
అదేంటంటే నేను నీతో ఉంటే ఎప్పుడు శృంగారం తప్ప వేరే ద్యాస ఉండదు.....
సైకాలజీ డాక్టర్ కి చూపిస్తే తెలిసింది....
నీకు అది మానసిక రోగమనీ....
దానికి మందులు లేవనీ...
పెళ్ళి అయినా వారం రోజులకే నీ చేతిలో చనిపోయానురా అని ఏడుస్తూ చెప్పింది.....

Comments

  • No Comments
Log Out?

Are you sure you want to log out?